Saturday, December 1, 2012

deo websites district wise

DSC Deo Adilabad District Merit list - http://deoadb.weebly.com/
DSC Merit list Deo Anantapur District - http://deoanantapur.blogspot.com/
Deo DSC Chittoor District Merit list : http://www.chittoor.ap.gov.in/
Deo Kadapa District DSC Merit List : http://www.kadapadeo.com/
Deo East Godavari merit list DSC : http://sites.google.com/site/deoegdt/
DSC Merit list Deo Guntur District : http://www.deoguntur.webs.com/
Merit List Deo Hyderabad DSC : http://www.deohyderabad.com/academic.html
DSC Merit list 2012 Deo Karimnagar District : http://deoknr.4t.com/
Deo khammam District merit list dsc : http://khammamdeo.com/
Deo merit list DSC Krishna District : http://www.zpkrishna.com/
Deo Kurnool District merit list DSC : http://www.deokurnool13.blogspot.com/
Deo Merit list DSC Mahbubnagar District : http://deombnr-ap.webnode.com/
Deo Medak District DSC merit list : http://deomedak.blogspot.com/
Deo DSC merit list Nalgonda District : http://deonalgonda.blogspot.com/
Deo DSC merit list Sri Potti Sreeramulu Nellore District : http://www.deonellore.50webs.com/
Deo Nizamabad District DSC merit list : http://www.nzbedn.org/
DSC merit list Deo Prakasam District : http://deoprakasam.co.cc/
DSC Deo Rangareddy District merit list : http://www.rrdeo.com/
Deo Srikakulam District merit list DSC : http://sites.google.com/site/deosklorg/
Deo Merit list DSC Visakhapatnam District : http://sites.google.com/site/deovizag/
Deo DSC merit list Warangal District : http://www.rjdsewarangal.net/
Deo DSC merit list West Godavari : http://www.westgodavari.org/

Read more: AP DSC Merit List 2012 District Wise For SGT, Schools Assistants, PET, Pundits http://educationsportal.blogspot.com/2012/10/ap-dsc-merit-list-2012-district-wise.html#ixzz2DoAhaYB0

Sunday, April 8, 2012

HEALTH IN HAND

HEALTH IN HAND:
మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది . ముందుగా రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.
రాశులు - శరీర భాగాలు

మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
సింహం - గుండె , వెన్నెముక
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి . గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.
గ్రహాలు - రుగ్మతలు
సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
ఇంద్ర- రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
వరుణ- మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
యమ - వంశ పారంపర్య  వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు ,మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి  గురవుతుందో లగ్న, సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది .

లేటెస్ట్ సామెతలు

సిమ్రాన్ సినిమా తీస్తే సావిత్రి సంగీతం కొట్టిందంటా
ఫూలన్ దెవి పున్యాణికి పోతే వీరప్పన్ మనకెందుకని వారించాడంటా
స్వామివారికే సైకిల్ లేదంటే పూజారి మోటార్ సైకిల్ కావాలన్నాడంట
తాలింపులోకి పామాయిల్ లేదంటే ఆయిల్ పుల్లింగ్ కి సంఫ్లవర్ ఆయిల్ కావాలన్నాట్ట
లచ్చలున్నమ్మి మచ్చలున్నా నచ్చుద్ది
కోటి విద్యలు ఎంప్లాయిమెంట్ కొరకే జాబు ఉండగానే జేబు నింపుకోవాలి
బారు పెట్టినవాడు బీరు పోయకమానడు

Tuesday, April 12, 2011

శ్రీరామనవమి

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

      సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||



శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

చరిత్ర

రామాయణం లో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర,కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే భాద్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్ర కు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్యకు రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఉత్సవంలో విశేషాలు

  • ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
  • బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
  • ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
  • ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).[ఆధారం కోరబడినది]
  • దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
  • భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
  • ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.