ఆధార్-మార్పులు
★ ఆధార్ అప్‌డేషన్‌పై మరింత స్పష్టతనిచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్).
★ ఆధార్‌లో కొన్ని మార్పులు ఎలాంటి పత్రాలు లేకుండానే చేసుకోవచ్చని ఉడాయ్ తాజాగా స్పష్టం చేసింది.
★ ఏ డాక్యుమెంట్లు ఇవ్వకుండానే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, బయోమెట్రిక్, ఫింగర్‌ప్రింట్, జెండర్, మొబైల్ నంబర్, ఐరిస్ స్కాన్, ఫొటో లాంటివి మార్చుకునేందుకు అవకాశం.
★ కేవలం మీ ఆధార్ కార్డు తీసుకుని మీకు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్తే చాలు’ అని ఉడాయ్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
★ పేరు, పుట్టినతేదీ, చిరునామా మార్చుకోవాలంటే మాత్రం సంబంధింత పత్రాలు అవసరమని ఉడాయ్ మరోసారి స్పష్టం చేసింది.
★ పాస్‌పోర్టు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం ఇలా ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని వివరణ..